న్యూఢిల్లీ, వెలుగు: పార్టీ బలోపేతం పై బీజేపీ హైకమాండ్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా గురువారం పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 22 మంది ముఖ్య నేతలకు సంస్థాగత బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ బీజేపీ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్)గా మధుకర్‌ను నియమించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఆయనకు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలను కూడా అప్పగించారు.
స్టేట్ జాయింట్ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్)గా దశరథ్ను నియమించారు. ఆయన వరంగల్ కేంద్రంగా బాధ్యతలు నిర్వహించనున్నారు. తెలంగాణలో గతంలో బాధ్యతలు నిర్వర్తించిన శివ్ ప్రకాశ్‌ను ఏపీకి నేషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్)గా నియమించారు. ఆయనకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవా బాధ్యతలు కూడా అప్పగించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఎంపీ తరుణ్ చుగ్ తెలిపారు
